నూతన అంగన్వాడి భవనానికి శంకుస్థాపన
న్యూస్ తెలుగు/వనపర్తి : కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనరెడ్డి గారు వనపర్తి మండలం మెంటే పల్లి గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వనపర్తి DCC అధ్యక్షులు శివసేన రెడ్డి గార్లు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన వారికి గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు అన్ని విధాల గ్రామ అభివృద్ధి సాధించేలా ఇటీవల ఎన్నికైన సర్పంచ్ లు పనిచేయాలని వారన్నారుగ్రామాభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారా లభించాలని ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ప్రతి సమస్య వాళ్ళ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని వారు సర్పంచ్ రాములు కు సూచించారు.కార్యక్రమంలో వనపర్తి మండల మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, మండలాధ్యక్షుడు రవి కిరణ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మార్కెట్ మాజీ అధ్యక్షులు ఎత్తం రవి, ఖిల్లా ఘణపురం మండల నాయకులు సాయి చరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : నూతన అంగన్వాడి భవనానికి శంకుస్థాపన )

