గణతంత్ర దినోత్సవ వేడుకలలో గీతాంజలి విద్యార్థులకు ప్రధమ స్థానం
న్యూస్ తెలుగు/వినుకొండ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పల్నాడు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రిపబ్లిక్ కార్యక్రమాలలో స్థానిక గీతాంజలి విద్యార్థులు కల్చరల్ యాక్టివిటీస్ నందు గ్రూప్ డాన్స్ లో ప్రథమ స్థానం పొందినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి తేల కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జిల్లా స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమాలలో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రథమ స్థానం పొందడం చాలా సంతోషంగా ఉందని అలాగే విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతం అనేకమంది హృదయాలలో జాతీయ భావాన్ని దేశభక్తిని నింపింది అని తెలిపారు. చిన్నారులు జిల్లా కలెక్టర్ చేతుల మీదగా అవార్డును అందుకొనడం తమ పాఠశాలకు గర్వ కారణం అని తెలిపారు. అనంతరం ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story : గణతంత్ర దినోత్సవ వేడుకలలో గీతాంజలి విద్యార్థులకు ప్రధమ స్థానం )

