చింతూరు ఎ పి జి బి మేనేజర్ కు ఉత్తమ అవార్డు
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు లోని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రామావతు. శ్రీనివాసరావు బ్యాంక్ నిర్వహణ లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు ప్రకటించింది. ఈ మేరకు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం లోసోమవారం నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్, ఐ టీ డి ఎ పి ఓ బచ్చు స్మరణ్ రాజ్ చేతులమీదుగా అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ఓ యస్ డి పంకజ్ గనోరే, డీఎఫ్ఓ శివకుమార్ , రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ , చింతూరు ఏ ఎస్పీ, రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు పొందిన మేనేజర్ శ్రీనివాసరావును బ్యాంకు సిబ్బంది అభినందించి, ప్రశంసించారు.(Story : చింతూరు ఎ పి జి బి మేనేజర్ కు ఉత్తమ అవార్డు )

