లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
న్యూస్ తెలుగు/వినుకొండ : బాలికల దినోత్సవం మరియు 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శనివారం బాల బాలికలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ అంతోనీ ప్రసాద్ ప్రారంభించారు. విద్యార్థిని విద్యార్థులు సైనికులుగా, డాక్టర్స్, టీచర్స్, జాతీయ నాయకుల వేషధారణలు మరియు ,తెలుగింటి సాంప్రదాయ దుస్తులు ధరించి చూపరులను అలరించారు. ఇ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు బాల శౌరయ్య మాట్లాడుతూ. విద్యార్థినీ విద్యార్థులు జీవితం లో క్రమశిక్షణ మంచి నడవడిక కలిగి, అన్ని రంగాలతో పాటు చదువులో రాణించాలని, దేశభక్తి కలిగి మంచి నాయకులు గా తయారవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళలకు ఏర్పాటుచేసిన ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు, ఉపాధ్యాయినిలు వీర, అంజలి, వాణి, అనీల, శారదా, రాజేశ్వరి ఉపాధ్యాయులు జయరావు మాస్టర్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.(Story : లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. )

