Home వార్తలు తెలంగాణ గ్రామాల్లో ప్రజలంతా సమానమే

గ్రామాల్లో ప్రజలంతా సమానమే

0

గ్రామాల్లో ప్రజలంతా సమానమే

న్యూస్‌తెలుగు/వనపర్తి : గ్రామాలలోని ప్రజలందరూ మనకు సమానమేనని పార్టీలకతీతంగా పనిచేసి గ్రామాలలో సర్వోతో ముఖాభివృద్ధి సాధించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. గత ఐదు రోజులుగా వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, అమరచింత, ఆత్మకూర్, గోపాల్పేట మండలం సంబంధించిన 133 మంది సర్పంచులకు…. వనపర్తి శివారులోనీ (YTC) యూత్ ట్రైనింగ్ సెంటర్లో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి శుక్రవారం ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు శిక్షణ తరగతులకు వచ్చిన సర్పంచులందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు
గ్రామాల్లో నెలకొనే పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సమస్య, వీధి దీపాల ఏర్పాట్లు, మురికి కాలువలో ఏర్పాటు పరిశుభ్రత, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, లాంటిd సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆయన సూచించారు. గ్రామాల్లో చేపట్టే ప్రతి పనిలో వార్డు సభ్యులను భాగస్వాములు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. నిర్వహించే గ్రామ సభల్లో సంబంధిత అధికారులందరినీ హాజరయ్యాలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్థాయిలోని ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు నిల్వ ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచులు లేదని ఆయన పేర్కొన్నారు. రైతులకు సంబంధించి భీమాకు కావలసిన వివరాలను ప్రతి ఒక్కరి పొందుపరచాలని వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు మాత్రమే మనం హడావిడిగా అన్ని పత్రాలను జమ చేసేందుకు ఇబ్బంది పడకుండా ముందుగానే భీమాకు సంబంధించిన వివరాలన్నింటినీ సంబంధిత శాఖ అధికారులతో పొందుపరిచేలా చూడాలన్నారు. భూ వివరాలకు సంబంధించి ఏదైనా మార్పిడి జరిగినప్పుడు వెంటనే వారి వివరాలను అప్డేట్ చేసేలా చూడాలన్నారు లేదంటే రైతు భరోసా లాంటి పథకాలలో ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు. గ్రామాలలో మహిళా సమైక్య భవనాల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు స్థల సేకరణ చేయాలని అందుకు సంబంధించి ఎమ్మెల్యేగా నేను భవనాలను మంజూరు చేయిస్తానన్నారు. సర్పంచులకు గౌరవ వేతనం పెంపు విషయంలోనూ, సర్పంచు పదవీకాలం ముగిసిన తర్వాత వారికి పింఛన్ ఏర్పాటు చేయించేందుకు సైతం ఉన్న మీ అభ్యర్థనను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. గ్రామస్థాయిలో కావలి కార్ వ్యవస్థను సైతం పటిష్ట పరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఒక్కసారి సర్పంచులుగా గెలుపొందిన మీరు చేసే సేవ జీవితంలో ప్రతి ఒక్కరు అభినందించేలా ఉండాలని గుర్తుండిపోయేలా ఉండాలని ఆయన సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం అనవసరపు ప్రార్థన చేస్తుందని 60% రాష్ట్రప్రభుత్వం 40% కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగస్వాములు అయ్యేవిధంగా ఉండాలని ప్రతిపాదించిన ప్రతిపాదనన సరైంది కాదని ఇందుకు సంబంధించి రేపు జరగబోయే గ్రామసభల్లో ప్రతి ఒక్కరు పాత పద్ధతిలోనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ తీర్మానాలు చేయాలనిఆ తీర్మానాలను తమకు వ్యక్తిగతంగా అందజేస్తే వాటిని ఢిల్లీ వరకు తీసుకుపోయి పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించేలా చూడవచ్చునని ఎమ్మెల్యే అన్నారు. మొదటి విడతగా చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమంలో మొత్తం 133 గ్రామపంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు రెండో విడుదల చేపట్టే శిక్షణ శిబిరంలో మిగతా గ్రామాల సర్పంచులు శిక్షణ పొందనున్నట్లు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం శిక్షణను పొందిన సర్పంచులందరికీ ఎమ్మెల్యే ద్రౌపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, స్థానిక సంస్థల కలెక్టర్ యాదయ్య, DLPO రఘునాథ్ రెడ్డి, DPO చక్రవర్తి, DRDO- DOT రాజు ఆయా మండలాల ఎంపీడీవోలు, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. (Story :గ్రామాల్లో ప్రజలంతా సమానమే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version