Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పాదయాత్ర కాదు.. 11 మంది ఎమ్మెల్యేలకు ఓదార్పు యాత్ర చేసుకో జగన్..

పాదయాత్ర కాదు.. 11 మంది ఎమ్మెల్యేలకు ఓదార్పు యాత్ర చేసుకో జగన్..

0

పాదయాత్ర కాదు.. 11 మంది ఎమ్మెల్యేలకు ఓదార్పు యాత్ర చేసుకో జగన్..

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన విజయవంతం

న్యూస్ తెలుగు/వినుకొండ : సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు దావోస్ యాత్ర విజయవంతమైందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ముస్లిం విద్యార్థినిలకు స్కాలర్షిప్స్ పంపిణీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక సమస్యలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిది అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు కృషిని ప్రజలు మరువలేరన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడిలో 25% ఏపీలో పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, 26 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వివరించారు. మూడేళ్లు కళ్ళు మూసుకోండి అధికారం మనదే అంటున్న జగన్ అసత్య ప్రచారాలు మానుకోవాలని నీవు ఇక 30 ఏళ్లు కళ్ళు మూసుకోవాల్సిందేనని చీఫ్ విప్ జీవి ఎద్దేవా చేశారు. అధికారం కోసం పాట కలలు కంటూ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం చేపడుతూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేస్తూ ప్రజల ఆదరణ చూసి జగనకు మతిభ్రమించి నేను చివరిలో పాదయాత్ర చేస్తానని అనడం హాస్యాస్పదమన్నారు. నీవు పాదయాత్ర కాదు, మీ 11 మంది ఎమ్మెల్యేల వద్ద పరామర్శ యాత్ర చేసుకోవటమేనని వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం అని ప్రజలు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి జే టాక్స్ తో రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. జే టాక్స్ తో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సిన పరిస్థితి నాడు నెలకొందన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా అసెంబ్లీకి రాకుండా వైసిపి ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సమస్యలపై ప్రస్తావించాలని హితవు పలికారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల నుండి రాష్ట్రంలో విదేశీ పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబు చేస్తున్న కృషిని ప్రజల మరువలేర న్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం కోటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తుందన్నారు. డీఎస్సీ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ని రాష్ట్ర యువత చీ కొడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయటం కాదని, ఐదేళ్లపాటు చేసిన అరాచకాలు దుర్మార్గాలకు జగన్ ప్రజల వద్దకు క్షమాపణ యాత్ర చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.(Story : పాదయాత్ర కాదు.. 11 మంది ఎమ్మెల్యేలకు ఓదార్పు యాత్ర చేసుకో జగన్.. )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version