రాజకీయాలకు అతీతంగా శివశక్తి సేవలు
ముస్లిం మైనారిటీ విద్యార్థినీలకు స్కాలర్షిప్లు పంపిణీ
న్యూస్ తెలుగు/వినుకొండ : రాజకీయాలకతీతంగా తాము శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తెలిపారు. యువ నేత,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం వినుకొండ పట్టణంలోని షాదీ ఖానాలో ముస్లిం పేద విద్యార్థినిలకు స్కాలర్షిప్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ జీవి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని స్కాలర్షిప్ లు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ 1998లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ తోనే ప్రారంభించడం జరిగిందన్నారు. 26 ఏళ్లగా ఫౌండేషన్ నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముస్లిం విద్యార్థినీలకు ఫౌండేషన్ నుండి స్కాలర్షిప్లు అందజేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. శివశక్తి ఫౌండేషన్ ఉపకార వేతనాలు అందుకున్న ఎంతోమంది విద్యార్థులు నేడు డాక్టర్లు, ఇంజనీర్లు, అనేక ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారని వివరించారు. మీరందరూ విద్యలో ఉన్నత ప్రతిభను కనబరిచి ఉన్నత స్థాయిలో స్థిరపడి పేదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. వినుకొండ ముస్లిం సోదరులు రాజకీయాల్లో తనకెంతో సహాయ సహకారాలు అందించారని వారికి రుణపడి ఉన్నానని తెలిపారు. వినుకొండ పట్టణానికి శాశ్వత త్రాగునీటి పథకం చేపడతానని, 210 కోట్లు నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న స్కాలర్షిప్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ. 26 ఏళ్ళుగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా జీవి ఆంజనేయులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలు మరువలేరన్నారు. ముస్లిం విద్యార్థినీలకు ఫౌండేషన్ నుండి స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమన్నారు. అలాగే ముస్లింలు బలహీనులు కారని, సహనంగా ఉంటారని, చదువు వద్దని ఇస్లాం మతం ఎక్కడ కట్టుబాటు చేయలేదన్నారు. సుదీర్ఘకాలంగా వినుకొండలో ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే జీవి ఆర్థికంగా అండగా ఉన్నారన్నారు. శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ముస్లిం కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముస్లిం కుటుంబాలు తమ పిల్లలను చదువులో ప్రోత్సహించాలని, ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో 1850 మంది ముస్లిం యువతులకు టీచర్ ఉద్యోగాలు లభించాయన్నారు. వైసిపి హయాంలో విద్యను నిర్వీరం చేశారని, నేడు మంత్రి లోకేష్ విద్యా ప్రమాణాలను పెంచుతూ, మంచి సంస్కరణలు ప్రోత్సహిస్తున్నారన్నారు. మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా మాట్లాడుతూ. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్కాలర్షిప్ రూపంలో అనేక ముస్లిం కుటుంబాలను ప్రోత్సహిస్తూ, విద్యపై విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారన్నారు. విద్య వల్లే ఆయా కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక మహిళ అన్న విషయం గుర్తించి ముస్లిం కుటుంబాలు తమ పిల్లలను విద్య వైపు మరలించాలన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా మాట్లాడుతూ. తాను సర్పంచిగా పనిచేసిన నాటి నుండి గత 25 ఏళ్లుగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకతీతంగా జీవి ఆంజనేయులు ఎన్నో ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూ విద్య వైపు మళ్ళిస్తున్నారన్నారు. అందువల్లనే ముస్లిం కుటుంబాలు జీవిని ఆదరిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా 74 ముస్లిం కుటుంబాల విద్యార్థినులకు 3 లక్షల 6 వేల రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. అనంతరం నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్టేట్ మైనారిటీ డైరెక్టర్ ఎస్.కె జమీర్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, షమీం ఖాన్, ఎస్కే మస్తాన్ వలి, ఎస్కే సుభాని, చికెన్ బాబు, పి . అయూబ్ ఖాన్, రియల్టర్ జానీ, గంధం కోటేశ్వరావు, బొంకూరి రోశయ్య, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.(Story : రాజకీయాలకు అతీతంగా శివశక్తి సేవలు )

