వివేకానంద ఆశయాలు ఆచరణలో పెట్టాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : స్వామి వివేకానంద ఆశయాలను యువతి యువకులు ఆచరణలో పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విఫ్, శాసనసభ్యులు జి. వి.ఆంజనేయులు పిలుపు నిచ్చారు. అభిల్ కలామ్ థెరిస్సా సేవా సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ. దేశ, సమాజ భవిష్యత్ కు యువత వివేకానంద ఆశయాలను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో యువశక్తి, స్త్రీ శక్తి ఉపయోగపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్, యువ మంత్రి లోకేష్ బాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. 13 లక్షలు 50 వేల నిధులతో అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తుందన్నారు. సొసైటీ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని , సొసైటీ ఫౌండర్ చందోలు నాగవాణి ని,రక్తదాతలను జి. వి. అభినందించారు. జమైక నుండి విచ్చేసిన విశిష్ఠ అతిధి, డిఆర్ చందోలు నాగ మల్లేశ్వరావు మాట్లాడుతూ. చందోలు గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభిల్ కలాం థెరిస్సా సేవా సొసైటీ అధ్యక్షురాలు చందోలు నాగవాణి మాట్లాడుతూ. వినుకొండ చుట్టు పక్కల ప్రాంతాల గర్భిణీ స్త్రీలు, తలసేమియా వ్యాధిగ్రస్తుల కు తక్షణమే రక్తం అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారు కీలక సమయం లో రక్తం కొరకు రక్త దాతల కొరకు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని, కావున యువకులు, దాతలు రక్త దానం చేసి బిడ్డ నిచ్చే తల్లి కి, శిశువుకు ప్రాణం పోసిన వరవుతారని ఆమె తెలిపారు. గౌరవ అతిధి సూపరిండెంట్ డా. కె. ఎస్.దయానిధి మాట్లాడుతూ. ప్రభుత్వ ఆసుపత్రి అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్, సొసైటీ ఆర్గనైజర్ జ్యోత్స్న, వైద్యమిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి, రాజు, సాగర్, సంతోష్, పల్లవి, ఏసురత్నం, సుకుమార్, సుబ్రహ్మణ్యం, హనుమా తదితరులు పాల్గొన్నారు.(Story : వివేకానంద ఆశయాలు ఆచరణలో పెట్టాలి )

