Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు

స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు

స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు/వినుకొండ : భారత జాతి ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మికతను, గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలు చాటి చెప్పిన స్వామి వివేకానంద జయంతి వేడుకలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, వినుకొండ శాఖ అద్వర్యంలో, స్థానిక ఫ్యాన్సీ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్వామి వారికి అందరూ పూలు సమర్పించి జయంతి వేడుకలు జరిపారు. స్వామి వివేకానంద యిచ్చిన సందేశాలు, యువతకిచ్చిన ప్రేరణలు, దేశభక్తిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండకార్యవాహ – ఇమ్మడిశెట్టి మల్లిఖార్జునరావు, గట్టుపల్లి కాశీవిశ్వనాధ్, గోనుగుంట్ల లక్ష్మీ రాజేష్, మరియు ఖండ కార్యకర్తలు, స్వయంసేవకులు, పెద్దలు ఐతా రామారావు, మిత్తింటి కృష్ణాంజనేయులు, ప్రచార ప్రముఖ్ గోనుగుంట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేవతి పెద్ద నరసింహారావు ముఖ్యవక్తగా పాల్గొని స్వామి వివేకానంద జీవిత విషయాలను తెలియ చేశారు.(Story : స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!