ప్రతిభా పురస్కారాల అందజేసిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలోని వై కన్వెన్షన్ హాల్ లో ఏపి కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా తమ తల్లిదండ్రులకు మరియు వినుకొండ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవలం ఉపాధ్యాయుల సంక్షేమమే కాకుండా, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రతిభా పురస్కారాల అందజేసిన ప్రభుత్వ )

