Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

డివైడర్‌పై మొక్కలు నాటిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు /వినుకొండ : పర్యావరణాన్ని కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని డివైడర్‌పై ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story:పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!