సాక్షి రిపోర్టర్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి సాక్షి రిపోర్టర్ రమేష్ గారి తండ్రి గారు ఇటీవల మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడి ఆయన మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సహాయ సహకారులకైన తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ, మాజీ కౌన్సిలర్ విభూది నారాయణ, ఎల్ఐసి కృష్ణ, పెద్దగూడెం తండా సర్పంచ్ వాల్య నాయక్, తాడిపర్తి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:సాక్షి రిపోర్టర్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే)

