Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ డైరెక్టర్లు కృషి చేయాలి

రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ డైరెక్టర్లు కృషి చేయాలి

0

రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ డైరెక్టర్లు కృషి చేయాలి

ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్పొరేషన్ డైరెక్టర్ గా వినుకొండ నియోజకవర్గం ఈపూరు టిడిపి నాయకులు రాపర్ల జగ్గారావును ప్రభుత్వం నియమించడం ఎంతో సంతోషకరమని ప్రభుత్వ చీఫ్ విప్, సీరియస్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. మంగళగిరిలోని గోపు గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన ప్రమాణస్వీకారం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ జీవి హాజరై డైరెక్టర్ రాపర్ల జగ్గారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ ) వృద్ధి కోసం డైరెక్టర్లు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ మరియు ఎంటర్ పెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.O ద్వారా ” ఒక వ్యవస్థాపకుడు, ఒక కుటుంబం ” లక్ష్యాన్ని సాధించే దిశగా పయనించాలన్నారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు, నిరుద్యోగం, పేదరికం ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. సూక్ష్మ, చిన్న, మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ పరిధిలో నడుస్తున్న లక్ష్యాలకు అనుగుణంగా డైరెక్టర్లు కొత్త పాలసీలను రూపొందించడం, అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాలని, ఎంఎస్ఎంఈ లకు అవసరమైన ప్రోత్సాహకాలు, మద్దతును అందించాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన డైరెక్టర్ రాపర్ల జగ్గారావు మాట్లాడుతూ. నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు కి, మంత్రి నారా లోకేష్ కి, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పదవికి వన్నె తెచ్చి, పరిశ్రమల వృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జగ్గారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ డైరెక్టర్లు కృషి చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version