Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 93 సార్లు రక్తదానం చేసి, ప్రజలను ఆదుకున్న పివి సురేష్ బాబు

93 సార్లు రక్తదానం చేసి, ప్రజలను ఆదుకున్న పివి సురేష్ బాబు

0

93 సార్లు రక్తదానం చేసి, ప్రజలను ఆదుకున్న పివి సురేష్ బాబు

న్యూస్ తెలుగు/వినుకొండ : మానవ సేవాసమితి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ పివి సురేష్ బాబు 93 వ సారి రక్తదానం చేయటం జరిగింది. గతంలో బెస్ట్ సోషల్ యాక్టివ్ వర్కర్ అవార్డు, మాజీ రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. 2024వ సంవత్సరం ఢిల్లీలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వారి చేతుల మీదుగా డాక్టరేట్ స్వీకరించడం జరిగింది. ఆపద సమయంలో తను రక్తదానం చేయటమే కాకుండా అవసరమైన సమయంలో వారి స్నేహితులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు అనేకమంది చేత రక్తం ఇప్పించి ఎందరో ప్రాణాలు కాపాడటం జరిగింది. అందరూ ఆపద సమయంలో ఆపద్బాంధవుడు అని అవసరానికి 108 లాగా వస్తాడని అందరివాడిగా తన స్నేహితులందరూ చెప్పుకుంటూ ఉంటారు.. సమాజసేవకుడిగా నిరంతరం శ్రమిస్తూ ఉంటాడని, కోవిడ్ సమయంలో ఎంతోమంది కి సేవలందించి చనిపోయినటువంటి వారికి అంతక్రియలు నిర్వహించి గొప్ప మనస్సు ఉన్న మంచి వ్యక్తి, మానవ సేవ సమితి సంస్థ వారు పేర్కొన్నారు.(Story : 93 సార్లు రక్తదానం చేసి, ప్రజలను ఆదుకున్న పివి సురేష్ బాబు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version