ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ
నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం
న్యూస్ తెలుగు/వినుకొండ : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు భరోసాగా నిలుస్తున్నాయని, అభివృద్ధి సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ. పేదల సేవలో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నది అన్నారు. త్రిమూర్తులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,లోకేష్ లు ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారు అన్నారు. రాష్ట్రానికి 13 లక్షల కోట్లు విలువైన విదేశీ పరిశ్రమలో రాగా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయన్నారు. అలాగే వినుకొండ శాశ్వత మంచినీటి పథకానికి 210 కోట్లు వచ్చాయని, 18 మాసాల్లోనే అభివృద్ధి పనులకు 451 కోట్లు నిధులు తేవడం జరిగిందన్నారు. అలాగే ఇప్పటివరకు సీఎంఆర్ ఫండ్ కింద 9 కోట్ల 16 లక్షలు విలువైన చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వైసిపి జగన్ విధ్వంస పాలనలో పోలవరంతోపాటు పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి అన్నారు. కాగా డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ప్రభుత్వంలో 16 వేల టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు బొంకూరు రోశయ్య, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, జనసేన నాయకులు నిశ్శంకర శ్రీనివాసరావు, కే. నాగ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.(Story : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ )

