నిజమైన నేస్తం మనకు పుస్తకమే..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ప్రతిభ కలిగిన 6 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు నైతికవిలువలు పెంపొందించే వివిధ రకాల పుస్తకాలను బెజవాడ చారిటీబుల్ అధినేత బెజవాడ వెంకట నాగేశ్వరరావు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సీనియర్ ఇంగ్లిష్ లెక్చరర్, ఎస్ కే కరీముల్లా మాట్లాడుతూ. పుస్తక పఠనం మనిషి వికాసానికి దోహద పడుతుందని, మనకు నిజమైన నేస్తం పుస్తకమేనని, ప్రతి విద్యార్థి పుస్తకంతో స్నేహాన్ని అలవర్చుకుంటే భవిష్యత్ బంగారుమయం అవుతుందన్నారు. అధ్యక్షత స్థానం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డా. వి యశోద మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటుగా క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా నాగేశ్వరరావు లాంటి దాతను చూసి స్ఫూర్తిని పొందాలని, పాఠశాల కు వెలకట్టలేని ఎన్నో విలువైన పుస్తకాలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్, ప్రతాప్ రెడ్డి, బాజి, జ్యోతి, తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. (Story: నిజమైన నేస్తం మనకు పుస్తకమే..)
