ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడను ప్రారంభించిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన వనపర్తి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను విషయంలో మంగళవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు ప్రారంభించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు వ్యక్తి యొక్క దేహదారుధ్యానికి మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని వయసుతో నిమిత్తం లేకుండా శారీరక శ్రమకు తగిన క్రీడలను ఆడుకోవచ్చునని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
వింగ్స్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్రీడలు వారం రోజులపాటు కొనసాగుతాయని ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయని, మొదటి బహుమతిగా 60 వేల రూపాయలు 2వ బహుమతిగా 30 వేల రూపాయలను బహుకరించుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు
కార్యక్రమంలో వనపర్తి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, నాయకులు శ్రీహరి రాజు, మధుసూదన్ గౌడ్ నిర్వాహకులు రాఘవేందర్ యాదవ్, పృథ్వి నాథ్ రెడ్డి, హరికుమార్ , టస్కుర్ ,కార్తీక్ ,యశ్వంత్ తో పాటు పలువు యువకులు తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడను ప్రారంభించిన ఎమ్మెల్యే )

