నట్టల నివారణ పంపిణీ కార్యక్రమం నిర్లక్ష్యం చేయకూడదు
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే నటన నివారణ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
మంగళవారం వనపర్తి పట్టణ శివారు ఒశ్యాతండాలో ఏర్పాటు చేసిన గొర్రెల, మేకలలల్లో నట్టల నివారణ మందుల కంపెనీ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పాల్గొన్నారు
జిల్లా మొత్తంలో 11 లక్షల 35వేలగొర్రెలు మేకలు ఉన్నాయని వీటికి మందులు పంపిణీ చేయడానికి జిల్లా వ్యాప్తంగా 265 ఆవాస ప్రాంతాలలో 33 టీంలను ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు
ఇందులో 20 లక్షల 40వేల ఖర్చుతో మూడు రకాల మందులను జీవాలకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు
ఈ సందర్భంగా ఆయన గొర్రెలకు నట్టల నివారణ మందును తాగించారు
గత ప్రభుత్వం యాదవుల అభివృద్ధి పేరున అందిన కాడికి దోచుకుని ఈ యాదవ సోదరులకు తీరని నష్టం చేకూర్చిందన్నారు
గొర్రెల పంపిణీ పథకం చేపట్టి అమాయక యాదవ సోదరుల పైన అందిన కాడికి దోచుకున్నారని ఆయన ఆరోపించారు
నేడు ఇందిరమ్మ రాజ్యంలో యాదవుల అభివృద్ధి కోసం పలు రకాల కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు
కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య బి కృష్ణ , వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మాజీ కౌన్సిలర్లు సోషల్ మీడియా కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యాదవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.ద్యారపోగు వెంకటేష్ టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్.(Story :నట్టల నివారణ పంపిణీ కార్యక్రమం నిర్లక్ష్యం చేయకూడదు)

