కళాశాలకు ట్రాక్టర్ మంజూరు
అధ్యాపకులకుఅందజేసిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కు సంబంధించిన బిఎస్సి అగ్రికల్చర్ పెద్దగూడెంలోని కళాశాలలో విద్యార్థుల సాంకేతిక విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ను మంగళవారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు కళాశాల అధ్యాపకులకు అందజేశారు
నాలుగు సంవత్సరాలుగా కొనసాగే అగ్రికల్చర్ బీఎస్సీ కోరుచు నందు పెద్దగూడెం కళాశాలలో 336 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని ఇందుకు సంబంధించి సాంకేతికపరమైన విద్యాభ్యాసం కోసం ట్రాక్టర్ ను ప్రభుత్వం కళాశాలకు మంజూరు చేసినట్లు వారు పేర్కొన్నారు
మంజూరైన ఈ ట్రాక్టర్ ను గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంతి గారికి అందజేశారు
కార్యక్రమంలో డిసిఓ శ్రీవేణి, ఏటీపీ స్వాతి, టీచింగ్ ఫ్యాకల్టీ సంధ్య రెండవ, నాలుగవ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.(Story : కళాశాలకు ట్రాక్టర్ మంజూరు)

