ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో ను జయప్రదం చెయ్యండి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కృతిక శుక్ల ఐఏఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా .షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 21 వ తేదీన ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమం గురించి ఏఎన్ఎం లకు ,ఆశా వర్కర్లకు,.అంగన్వాడీ కార్యకర్తలకు, మెప్మా సిబ్బందికి యూపీహెచ్ సి హనుమాన్ నగర్ డా. కౌషిక్ అవగాహన కల్పించారు. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో దాదాపు 30 పల్స్ పోలియో కేంద్రాలను 150 మంది సిబ్బందితో ఏర్పాటు చేయడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఉన్న 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా ఈ పల్స్ పోలియో కార్యక్రమానికి హాజరై పల్స్ పోలియో చుక్కలు వేయించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. పల్స్ పోలియో చుక్కల ప్రాముఖ్యతను, పోలియో చుక్కలు వేయించకపొడం వల్ల కలిగే వైకల్యం గురించి ప్రజల్లో అవగాహన తేవాలన్నారు. అలాగే ప్రయాణం లో ఉన్న వారి కొరకు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో కూడా పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పల్స్ పోలియోకు సహకరించి తమ పిల్లలను నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకట్రావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(Story : ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో ను జయప్రదం చెయ్యండి. )

