ఏపీ యు డబ్ల్యూ జె ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి జర్నలిస్ట్ సోదరునికి ఫ్యామిలీ హెల్త్ కార్డులు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ గౌరవ అధ్యక్షులు జగన్, అధ్యక్షులు భువన, కార్యదర్శి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం 1957వ సంవత్సరంలో స్థాపించడం జరిగిందన్నారు. నాటినుండి నేటి వరకు ప్రతి జర్నలిస్ట్ సోదరునికి అండగా ఉండి వారి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. నేడు ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులకు అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డ్, ఇంటి స్థలాలు, ఫ్రీ బస్ పాసులు, రైల్వే పాసులు, వారి పిల్లలకు 50 శాతం రాయితీతో కూడిన విద్య ఇవన్నీ ఏపీ యు డబ్ల్యూ జె పోరాట ఫలితంగానే సాధించుకున్నవి అని తెలియజేశారు. అనంతరం లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందజేసినటువంటి హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పారెళ్ళ రమేష్, యార్లగడ్డ బుజ్జి ప్రధాన కార్యదర్శి సందు కోటేశ్వరరావు, ట్రెజరర్ అన్నా మల్లికార్జునరావు, సీనియర్ జర్నలిస్టులు యార్లగడ్డ ఆజాద్, లగడపాటి వెంకట్రావు, ప్రకాష్ , లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది మరియు నియోజకవర్గంలోని జర్నలిస్ట్ సోదరులు పాల్గొన్నారు.(Story : ఏపీ యు డబ్ల్యూ జె ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ )

