పాఠశాలకు క్రీడా పరికరాలు అందజేసిన “సుబ్బారాయుడు సులోచన మెమోరియల్ సేవా ఫౌండేషన్”
న్యూస్ తెలుగు/వినుకొండ : “సుబ్బరాయుడు సులోచన మెమోరియల్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టి.కృష్ణమోహన్ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక నరసరావుపేట రోడ్డులోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణ మోహన్ మాట్లాడుతూ. పేద విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, తద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని, వారిలోని క్రీడా నైపుణ్యాలు వెలికి తీయాలంటే వారికి తగిన క్రీడా సామాగ్రి అవసరమని అన్నారు. అందువల్లే ఫౌండేషన్ ద్వారా క్రీడా పరికరాలు అందజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ముందుకు వెళతామని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ. దాతల సహకారంతో విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు వాటిని జాగ్రత్తగా వాడుకొని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, ప్రసాద్, ఎస్.కె మౌలాలి, ఏటీపీ యోగయ్య, పి ఈ టి. జోనా నాయక్, విద్యార్థులు మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.(Story : పాఠశాలకు క్రీడా పరికరాలు అందజేసిన “సుబ్బారాయుడు సులోచన మెమోరియల్ సేవా ఫౌండేషన్” )

