వెల్లటూరు గ్రామంలో పబ్లిక్ తో అవేర్నెస్ ప్రోగ్రామ్
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని వెల్లటూరు గ్రామంలో వినుకొండ రూరల్ సిఐ బ్రహ్మయ్య, బొల్లాపల్లి ఎస్సై సమీర్ భాష సమక్షంలో పబ్లిక్ తో అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. గ్రామాలలో ఫ్యాక్షన్ లేకుండా ఎటువంటి గొడవలకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని మరియు సైబర్ నేరాల గురించి కొత్త చట్టాల గురించి మైనర్ పిల్లలపై జరుగు నేరాల గురించి ఫోక్సు చట్టం గురించి మరియు రోడ్డు భద్రత లో భాగంగా ద్విచక్ర వాహనాలు నడుపు వారందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం త్రాగి వాహనాలు నడపరాదని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, మైనర్ పిల్లలకు టూ వీలర్స్ ఇవ్వకూడదని, అదేవిధంగా ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి అని, గ్రామాలలో ఎక్కడన్నా గంజాయి సేవించడం గాని వాటిని దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో మొక్కలను పెంచడం గాని తెలియజేస్తే వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ప్రజలకు వినుకొండ రూరల్ సిఐ బ్రహ్మయ్య, బొల్లాపల్లి ఎస్సై సమీర్ భాష తెలిపారు. సిఐ నెంబర్:9440796226, ఎస్ఐ నెంబర్ :9440796249.(Story : వెల్లటూరు గ్రామంలో పబ్లిక్ తో అవేర్నెస్ ప్రోగ్రామ్ )

