Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా మండల స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీలు

ఘనంగా మండల స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీలు

ఘనంగా మండల స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీలు

న్యూస్ తెలుగు/వినుకొండ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ ఎస్పి కాలనీ నందు వినుకొండ మండల స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీలు బుధవారం జరిగాయి. ఈ పోటీలలో వినుకొండ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. ఈ పోటీలను వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రూల్లా ఈ ప్రదర్శనను తిలకించి విద్యార్థుల నుండి ఆ ప్రదర్శన సంబందించిన విషయాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ పోటీల లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన విజేతలను మున్సిపల్ చైర్పర్సన్ షేక్ షకీల బహుమతులను అందజేశారు.. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాల నుండి సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈప్రదర్శనలకు న్యాయ నిర్ణెతలుగా సి.హెచ్. చంద్రశేఖర్, టి అనిల్ కుమార్ సైన్స్ ఉపాధ్యాయులు వ్యవహరించారు ఈ ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఐదు ప్రదర్శనలు వరుసగా 1) సెలైన్ వాల్, జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఎన్ఎస్పి కాలనీ వినుకొండ.2) స్మార్ట్ పార్కింగ్,ఏ.పి మోడల్ స్కూల్ చీకటీగలపాలెం.3) ఆక్వా ఫోనిక్స్, జెడ్.పి.హెచ్.స్కూల్, ఏనుగుపాలెం.4) లిఫ్ట్ సిస్టమ్, జడ్పీహెచ్ఎస్ స్కూల్, ఎన్ఎస్వి కాలనీ వినుకొండ.5) టీచర్స్ విభాగంలో మ్యాథ్స్ మోడల్, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ వినుకొండ. పై వారందరినీ ఈనెల 19వ తేదీ నుండి జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీల్లో పాల్గొనటానికి అర్హత సాధించారు. కన్సలేషన్ ప్రదర్శన, 1)జేసిబి మోడల్, జడ్పీహెచ్ స్కూల్ నాగులవరం.2) ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సెర్, జడ్పీ గర్ల్స్ హైస్కూల్ వినుకొండ 3) ఇంటర్నల్ ఆర్గానిక్ సిస్టమ్, ట్రైబల్ వెల్ఫేర్ గాడ్స్ స్కూల్, వినుకొండ.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story:ఘనంగా మండల స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!