ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులుకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. 35 అర్జీలు వచ్చాయి.. వినుకొండ పట్టణంతోపాటు గ్రామాల్లో పింఛన్లు, భూ సమస్యలు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు.
• సమస్యలు వెల్లువ
శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ ట్యాంకును తొలగించి, ప్రమాదాన్ని నివారించండి
ప్రజా దర్బార్లో వెల్లటూరు చెంచుల వినతి
ప్రభుత్వ చీప్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలు సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కు మొరపెట్టుకోగా, స్పందించిన జీవి ఆయా శాఖల అధికారులకు ఫోన్ చేసి సత్వరం ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామ చెంచుల కాలనీ లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం ఉందని, ఆ ట్యాంక్ చుట్టూ తమ గృహాలు ఉన్నాయని, ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొందని జీవికి చెంచులు వివరించారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఓవర్ హెడ్ ట్యాంకు. వాస్తు లోపం ఉందన్న కారణంగా, వాడుక లో లేదని, ప్రమాదం జరగకముందే ఆ ట్యాంక్ ను తొలగించాలని వారు వేడుకొన్నారు. మున్సిపల్ సంబంధించిన వర్కులు తాలూకు తమకు బిల్లులు ఇవ్వడం జాప్యం చేస్తున్నారని ఓ వ్యక్తి ప్రజాదర్బార్లో వాపోయాడు. స్థానిక 6వ వార్డులో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, 4 మాసాలుగా విద్యుత్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని, ట్రాన్స్ఫారం దెబ్బతిన్నని, విద్యుత్ వైర్లు కాలం తీరి ఉన్నాయని జీవికి ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలో ఏ వార్డుల్లో కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయో పరిశీలించి తమకు తెలపాలని, టిడిపి క్లస్టర్ ఇన్చార్జిలకు జీవి సూచించారు. అలాగే ఈపూరు మండలం వనికుంట గ్రామానికి చెందిన గన్నవరం అంకమ్మ తనకు పెన్షన్ రాయకుండా తిప్పుతున్నారని, తక్షణం పెన్షన్ ఇప్పించి తనను ఆదుకోవాలని జీవికి మొరపెట్టుకున్నాడు. స్థానిక ఆర్టీసీ పక్కన సన్నిధి మున్సిపల్ కాంప్లెక్స్ లో పెద్ద మొత్తంలో అడ్వాన్సులు చెల్లించి అద్దెలకు ఉంటున్న వ్యాపారులు తమకు వ్యాపారాలు సరిగా లేవని పెద్ద మొత్తంలో అడ్వాన్సులు చెల్లించామని, అద్దెల భారం కొంచెం తగ్గించాలంటూ షాపులు వారందరూ జీవికి వినతి పత్రం అందజేసి మొరపెట్టుకున్నారు. (Story:ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం )

