గోకనకొండ లో పొలం పిలుస్తోంది..
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని గోకనకొండ, నాగులవరం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయఅధికారి జీ వరలక్ష్మి మాట్లాడుతూ. వరి పొలంలో అగ్గి తెగులు ఆశించినట్లు గమనించటం జరిగిందని, నివారణకు ట్రై సైక్లోజోల్ 120 గ్రాములు+బావిస్టిన్ 250 గ్రాములు ఎకరా పైరు పై పిచికారి చెయ్యడం ద్వారా అగ్గి తెగులు నివారించుకోవచ్చని అన్నారు. రైతులు ఖరీఫ్ లో ఈ పంట నమోదు చేయించుకొనీ , పండించిన వరి ధాన్యాన్ని రైతు సేవ కేంద్ర సిబ్బంది ద్వారా షెడ్యూలింగ్ చేయించుకొని, తేమశాతం 17% ఉన్నట్లయితే ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కనీస మద్దతు ధరకు అనగా గ్రేడ్ ఏ రకం క్వింటాలు రూ:2389/-, సాధారణ రకం క్వింటాలు రూ:2369,,75 కేజీలు గ్రేడ్ ఏ రకం రూ:1792 సాదారణ రకం 75 కేజీలు: 1777/-, నాణ్యత ప్రమాణం ఉన్నట్లయితే ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించుకోవచ్చని అన్నారు. తేమ శాతం 17 కంటే అధికంగా ఉన్న ఎడల ఆరబెట్టుకోవాలని ఒకవేళ తేమ శాతం 17 కి మించి ఉన్నట్లయితే 1% కి 1 కిలో తరుగు తో 22% వరకు 5 కిలోల తరుగుతో ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం మద్దతు ధరకు అమ్ముకోవచ్చని తెలిపారు. (Story:గోకనకొండ లో పొలం పిలుస్తోంది..)

