కోస్టు వలస గ్రామంలో పొలం పిలుస్తోంది
న్యూస్ తెలుగు /సాలూరు : ఆరోగ్యవంతమైన పంట పండించడంలో రైతులను నిష్ణాతులను చేయడమే పొలంబడి యొక్క ముఖ్య ఉద్దేశమని పాచిపెంట వ్యవసాయ అధికారి తిరుపతిరావు అన్నారు. మంగళవారం కోస్టు వలస గ్రామంలో పొలం పిలుస్తోంది పొలంబడి అనే కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం పనుకువలస సర్పంచ్ చెల్లూరు సీతారామకృష్ణ అధ్యక్షతన కొస్టు వలస గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో తిరుపతి రావు మాట్లాడుతూ పంటలకు అధిక మొత్తంలో యూరియాను వాడకూడదని అన్నారు. నానో యూరియా వాడితే అధిక దిగుబడి సాధించవచ్చు అని తెలిపారు. రైతులు ఆధునిక నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి. లాభసాటి వ్యవసాయాన్ని చేసుకోవాలని అన్నారు. 14 వారాలపాటు జరగబోయే పొలంబడి కార్యక్రమంలో చర్చించాల్సిన అంశములు గ్రామంలో నెల స్వభావం నీటి సదుపాయం మిత్ర పురుగులు శత్రు పురుగులు గుర్తింపు నిరంతర పంటల విశ్లేషణ చేయడం జరుగుతుందన్నారు. ఎరువులు మరియు పురుగుల మందుల వాడకంపై నియంత్రణ సహజ కీటకాల అభివృద్ధి సమగ్ర పంటల యాజమాన్యం వంటి వివిధ అంశములను తెలుసుకొవలని తెలిపారు. ఆరోగ్యవంతమైన పంట పండించడంలో రైతులను నిష్ణాతులుగా చేయడమే పొలంబడి లక్ష్యము అని అన్నారు. ఉత్సాహం కలిగిన ఆసక్తి కలిగిన 30 మంది రైతులను ఎంపిక చేసి 14 వారాలపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పొలంబడిలో దర్గా కాలిక మరియు స్వల్ప కాలిక ప్రయోగాలను నిర్వహించడం ద్వారా రైతులకు పంటల యాజమాన్యంపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. దానికోసమే పొలంబడి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ చెల్లూరు సీతారామ కృష్ణ మాట్లాడుతూ మన గ్రామంలో పొలంబడి నిర్వహణ జరగడం ఒక మంచి అవకాశం అని గ్రామస్తులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడకం తగ్గించి సహజ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచుకోవడానికి ఈ పొలంబడి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు కార్యక్రమంలో ఏఈఓ నాగమణి, రైతులు చెల్లూరు సోములు, వీరయ్య, కోసు, శాంతారావు, పొదిలాపు సుకరయ్య, రెయ్యి సన్యాసి ,లక్ష్మణ తదితర రైతులు పాల్గొన్నారు.(Story : కోస్టు వలస గ్రామంలో పొలం పిలుస్తోంది)
