Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గీతమ్స్ లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియా 2025 ప్రతిభా పరీక్ష

గీతమ్స్ లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియా 2025 ప్రతిభా పరీక్ష

గీతమ్స్ లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియా 2025 ప్రతిభా పరీక్ష

న్యూస్ తెలుగు/వినుకొండ : శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి సందర్భంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్ – 2025 ప్రతిభా పరీక్షను ఎం.కె.ఆర్ అండ్ కే.ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈనెల 21 వ తేదీ ఆదివారం 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్ ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి తెలిపారు. 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎన్ఎస్పి కాలువ కట్టపై ఉన్న గీతమ్స్ బ్లూమ్స్ పాఠశాల నందు 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులకు సిద్ధార్థ నగర్ లోని గీతమ్స్ హైస్కూల్ నందు ఈ ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి క్లాస్ కు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు 2,000. 1,500. 1, 000 నగదు ప్రోత్సాహక బహుమతి మరియు మెమొంటోస్ అందించబడతాయని మరియు 4వ, 5వ స్థానాల్లో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు అందించబడతాయి అన్నారు. విద్యార్థిని, విద్యార్థులు తమ పేర్లను పాఠశాలల యందు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు సెల్:- 99857 40950, 63044 91025 నెంబర్లలో సంప్రదించవచ్చు అన్నారు.(Story : గీతమ్స్ లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియా 2025 ప్రతిభా పరీక్ష )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!