బిజాపూర్లో 34 మంది మావోయిస్టు ల లొంగుబాటు
న్యూస్ తెలుగు /చింతూరు : ఛత్తిస్ ఘడ్ రాష్ట్రం బీజపూర్ జిల్లా ఎస్పీ జీతేంద్ర కుమార్ యాదవ్ ఎదుట మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతి కలిశారు.
.ఆపరేషన్ కగార్, వరుస లొంగుబాట్లతో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు. 27 మంది పురుషులు ఉన్నారు. వీరిపై రూ. 84 లక్షల రివార్డ్ ఉంది. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యుడు పాండ్రు పునెం అలియాస్ సంజు, పీఎల్డీఏ కంపెనీ నం. 2, వివిధ కంపెనీలకు చెందిన నలుగురు, ముగ్గురు ఏసీఎంలు, ప్లాటూన్, ఏరియా కమిటీ పార్టీ సభ్యులు
ఎనిమిది మంది, మిలీషియా ప్లాటూన్ కమాండర్లు ముగ్గురు, ఐదుగురు మిలీషియా ప్లాటూన్ సభ్యులు, జనతన సర్కార్ వివిధ ఆర్పీసీలకు అధ్యక్షులు తొమ్మిది మంది ఉన్నారని ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు. వీరికి రాష్ట్ర పునరావాస విధానం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు తక్షణ సాయం అందించామన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బీజాపూర్ జిల్లాలో గత ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 824 మంది మావోయిస్టులు జనజీవన స్రంవంతిలో కలిశారని పోలీసులు చెప్పారు. 1,079 మంది మావోయిస్టులు అరెస్టు కాగా 220 మంది మావోయిస్టులు వివిధ ఎన్కౌం టర్లలో మరణించినట్లు పేర్కొన్నారు.(Story : బిజాపూర్లో 34 మంది మావోయిస్టు ల లొంగుబాటు )

