Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ లో టీడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలి

వినుకొండ లో టీడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలి

0

వినుకొండ లో టీడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలి

మున్సిపల్ కార్యాలయం వద్ద లబ్ధిదారుల ధర్నా

న్యూస్ తెలుగు / వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ఆధ్వర్యంలో సోమవారం ఉదయం వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద టిట్కో గృహాల లబ్ధిదారు లకు వెంటనే కరెంటు, మంచినీళ్లు మొదలగు మౌలిక వసతులు కల్పించి టీడ్కో గృహాలను ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ పట్టణ సిపిఐ సహాయ కార్యదర్శి కొండ్రముట్ల సుభాని అధ్యక్షత వహించగా, సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము లబ్ధిదారులకు మద్దతుగా మాట్లాడుతూ.. పది సంవత్సరాల నుండి టీడ్కో గృహాలను ఇస్తారని ప్రభుత్వం వైపు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని వారికి సొంత ఇంటి కల నెరవేరుతుందని ఇక అద్దెల బాధ తప్పుతుందని అనేక ఆశలు తో ఎదురుచూస్తున్నారు. సుమారు 1400 పైగా లబ్ధిదారులు ఉన్నారని, 700 పైగా ఇల్లు పూర్తిగా నిర్మాణం జరిగాయని, కేవలం మౌలిక వసతులు కోసమే వారికి ఇవ్వకుండా ఆపారని, పూర్తి అయిన వరకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇచ్చి వారి సొంత ఇంటి కల నెరవేర్చాలని, అద్దెల బాధ నుండి వారిని కాపాడాలని ఈ సందర్భంగా రాము లబ్ధిదారులు ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ కిషోర్, రాయబారం వందనం, బాధితులు జీడిమల్ల శ్రీనివాసరావు, షేక్ ఖాసిం, షేక్ షహేనా, ఎస్కే కరీం, మున్ని బేగం, కుమారి, లక్ష్మీరాజ్యం, పద్, ఎస్ కే జాన, సుభాషిణి, మల్లి, నూర్జహాన్, మారతమ్, రమణకుమార, శ్రావణి, రాజ్య, నరసింహారావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.(Story:వినుకొండ లో టీడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version