వినుకొండ లో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలు
న్యూస్ తెలుగు /వినుకొండ :
* టిడిపి ఆధ్వర్యంలో…
తెలుగు ప్రజల ఆరాధ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా వినుకొండ టిడిపి నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
* వైసీపీ ఆధ్వర్యంలో….
సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల నాయకులు పాల్గొని, తెలుగు ప్రజల కోసం తన ప్రాణత్యాగం చేసిన అమరజీవి సేవలను స్మరించుకున్నారు. ఆయన త్యాగస్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకమని నాయకులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి బాటలు వేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
* ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో….
ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండ లో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథంరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథంరావు, ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్స్, సదావర్తి సంఘల నాయకులు పాల్గొని శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని పాత మార్కెట్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తమిళులపై 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలుఅర్పించి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. అటువంటి పితామహుడు కి నివాళులర్పించామని, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల కాంశ్య విగ్రహంతో స్మృతి వనం ఏర్పాటు చేస్తుండడం పట్ల, అలాగే పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండ గా నామకరణం చేయడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కు సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సదావర్తి సంఘం అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జి, ప్రధాన కార్యదర్శిలు పెరుమాళ్ళ అమర్నాథ్, రెడ్డి నగేష్ బాబు, రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు, శివాలయం చైర్మన్ కొల్లిపర బాలసుబ్రమణ్యం, జిల్లా బిజెపి మాజీ కార్యదర్శి మేడం రమేష్, ఆర్యవైశ్య సంఘ సీనియర్ నాయకులు రెడ్డి వెంకటరత్నం, రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం కార్యదర్శి మండవ వెంకట కిరణ్ కుమార్, వినుకొండ వాసవి క్లబ్స్, వినుకొండ సీనియర్ నాయకులు కర్రే అని కుమార్, అప్పల రాజా, టంగుటూరి, గుర్రం బాల సాయికుమార్, కొల్లిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.(Story:వినుకొండ లో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలు)

