జాబ్ మేళా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
వినుకొండలో ఈనెల 22న మెగా జాబ్ మేళా
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో మెగా జాబ్ మేళా జరుగుతుందని, నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యాలయ నిర్వహణ అధికారి సుబ్బారావు ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 22వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాకి 30కి పైగా ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని, నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు చీఫ్ విప్ కార్యాలయం నుండి ఆన్లైన్ వెబ్సైట్ లింక్, క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందని వివరించారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే యువతి యువకులకు ఉచితంగా సేవను అందించేందుకు చీఫ్ విప్ కార్యాలయంలో ఆన్లైన్ దరఖాస్తు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. https://forms.gle/mv3owsZtSizQKzNp6 (Story:జాబ్ మేళా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి)

