Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విఠంరాజు పల్లె, పిచికలపాలెం, చినకంచెర్ల వరకు గుంతల మయం

విఠంరాజు పల్లె, పిచికలపాలెం, చినకంచెర్ల వరకు గుంతల మయం

0

విఠంరాజు పల్లె, పిచికలపాలెం, చినకంచెర్ల వరకు గుంతల మయం

వెంటనే గోతులు పూడ్పించాలని పిడియం డిమాండ్

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో విఠంరాజుపల్లి నుండి శావల్యాపురం మండలం పిచ్చుకల పాలెం, చిన్నకంచెర్ల వరకు ఏడు కిలోమీటర్లు తారు రోడ్డు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనాలు, ప్రజల రాకపోకలకు అంతరాయంగా ఉంది. ప్రజలు గ్రీవెన్స్ పిజిఆర్ఎస్ లో అధికారులకు తెలిపారు. అలాగే ప్రభుత్వ చీఫ్ విఫ్, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కి ప్రజలు అనేకసార్లు మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పినట్లు స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల దృష్టికి తెచ్చారు. ఇటీవల మంజూరైన రోడ్లలో ఈ రోడ్డు ప్రస్తావన లేకపోవడం విఠంరాజుపల్లి, పిచ్చుకలపాలెం, చిన్నకంచెర్ల తదితర గ్రామాల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీవి ఆంజనేయులు వెంటనే ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేయించి పనులు మొదలయ్యేలా చూడాలని ఆయనను కోరారు. వై వెంకటేశ్వరరావు (వైవి) పిడియం రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. (Story:విఠంరాజు పల్లె, పిచికలపాలెం, చినకంచెర్ల వరకు గుంతల మయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version