పేదల ప్రాణాలను నిలబెడుతున్న సీఎం రిలీఫ్ ఫండ్
సీఎం సహాయ నిధి ద్వారా 8.89తో 1260 మంది పేద కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రాణ అపాయస్థితిలో ఉన్న నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందజేస్తూ ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శనివారం జీవి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 32 మందికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 32.98 లక్షలు ఆర్థిక సహాయ నిధి చెక్కులు, 6 ఎల్ వో సి లను అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. పేదలకు ముఖ్యమంత్రి సహాయ ఇది ఒక వరమని, వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న సీఎం సహాయ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 నెలల కూటమి పాలనలో వినుకొండ నియోజకవర్గంలోని 1260 మంది పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు 8.89 కోట్లు సీఎం సహాయ నిధులు అందించి ఆదుకోటం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి సహాయని చెప్పారు పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అలసత్వం ఉండేదని ఐదేళ్లలో నాడు కేవలం 500 కూడా సహాయనిది చెక్కులు ఇవ్వలేదని, నేడు 18 నెలల్లోనే 1260 మంది పేదలకు సీఎం సహాయ నిధులు చెక్కులు అందజేయటం సంతోషకరమన్నారు. ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకునే పేదవాళ్లు ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఆలస్యం చేయకుండా సీఎం సహాయ నిధులు విడుదల చేస్తూ ఆదుకుంటున్నారని అన్నారు. ఎవరైనా బాధితులు వైద్య ఖర్చులు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన వివరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.(Story:పేదల ప్రాణాలను నిలబెడుతున్న సీఎం రిలీఫ్ ఫండ్)

