నాలుగు గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా
న్యూస్ తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులను వార్డు సభ్యులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి నియోజకవర్గం అడ్డాకుల మండలం కన్మనూరు బలిజపల్లి చిన్నమునగల్ చెడ్ పెద్దమునగల్చేడు గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండవ విడతలో నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని శనివారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యుల తరఫున నాలుగు గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాలలోని నిరుపేదలందరికీ ఇందిర ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, మహిళలకు వడ్డీ లేని రుణాలు లాంటి అనేక పథకాలు చేపట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
మరో మూడు సంవత్సరాలు ఆపై పది సంవత్సరాలు మొత్తం 13 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని పొరపాటున అవతలి వ్యక్తులు ఎవరైనా గెలిచిన వారు సాధించేది ఏది ఉండదని ఆ గ్రామంలో అభివృద్ధి ఆగిపోతుంది తప్ప ఎందుకు పనికిరాదని ఆయన అన్నారు
కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులందరినీ సర్పంచులుగా వార్డు సభ్యులుగా గెలిపించి ఇస్తే నాలుగు గ్రామాలను పూర్తిస్థాయిలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు
కార్యక్రమంలో వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పెద్దమందడి సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సత్యరెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : నాలుగు గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా )
