నిర్వాసితుల సమస్యలకై కృషి చేస్తా..
న్యూస్ తెలుగు ప్రతినిధి/ సిద్దిపేట/ అక్కన్నపేట: సేవాలాల్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా, సేవకు డిగా పనిచేస్తానని సేవలాల్ మహారాజ్ తండా సర్పంచ్ అభ్యర్థి ముడావత్ బంగారి హరిలాల్ పేర్కొన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ తండా వాసులతో కలిసి ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ గా తమని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కష్టపడి పనిచేస్తానన్నారు. గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతాంగ సమస్యల పరిష్కారంకై పోరాడుతానని వ్యాఖ్యానించారు. నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతినీ అన్ని విధాలుగా అభివృద్ధిలో నిలిచేలా చేస్తానని హామీ ఇచ్చారు.(Story:నిర్వాసితుల సమస్యలకై కృషి చేస్తా..)

