Home వార్తలు తెలంగాణ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు

0

పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు

న్యూస్ తెలుగు/వనపర్తి : ఖిల్లా గణపురం మండలంలో నిర్వహించనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అన్నారు. బుధవారం ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో ని ఎంపీడీఓ కార్యాలయల ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఘనపూర్ మండల పరిధిలో 27 సర్పంచి, 198 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు గాను పోలింగ్ సిబ్బంది మెటీరియల్ తీసుకొని తరలి వెళ్ళారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను తీసుకొని కేటాయించిన గ్రామ పంచాయతీకి రూట్ వారిగా బస్సులో తరలి వెళ్ళారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండ, భయబ్రాంతులకు గురి కాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని సూచించారు.ప్రతి పోలింగ్ కేంద్రం ముందు ఫారం – 9 లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తు పోస్టర్ అతికించాలని సూచించారు. తహసీల్దారు సుగుణ, ఎంపీడీవో విజయసింహారెడ్డి, తదితరులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.(Story :పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version