ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు 50 రగ్గులు వితరణ
న్యూస్ తెలుగు /చింతూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు చలికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని స్థానిక జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మహమ్మద్ జమాల్ ఖాన్ బుధవారం 50 రగ్గులను ఆసుపత్రి సూపరిండెంట్ కోటిరెడ్డి సమక్షంలో అందజేశారు. మన్యంలో చలి రోజురోజుకు ఉదృతం కావడంతో ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన రోగులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని ట్రస్ట్ చైర్మన్ కు సూపర్నిడెంట్ వివరించగా జమాల్ ఖాన్ రగ్గులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రియాజ్, పి సాల్మన్ రాజు, ట్రస్ట్ సభ్యులు నటరాజ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.(Story : ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు 50 రగ్గులు వితరణ )
