కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తేనే గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని బీఆర్‌ఎస్ పార్టీ
కబ్జాకోరుల మాటలు నమ్మి మోసపోతే ఇబ్బందులు ఎదుర్కొంటామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఖిల్లా ఘణపురం మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప్పరపల్లి , సూరాయిపల్లి
దొంతికుంట తండా , మానాజీపేట
మల్కాపురం, గట్టు కాడిపల్లి వెంకటంపల్లి ఆగారం , ఖిల్లా ఘణపురం
మామిడి మాడ , సల్కేలాపురం గ్రామం తో పాటు పలు తండాలలో సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి ప్రచారీకి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. డోలు డప్పులతో నృత్యాలు చేస్తూ నుదుటన తిలకం దిద్ది మంగళహారతి ఇస్తూ మహిళలు సైతం ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మరో పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ప్రస్తుతం మూడేళ్లు తాను ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు రవి గారు ఎంపీగా ఉంటారని గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో గ్రామాలలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కేవలం అభివృద్ధి పనుల మాటున అందిన కాడికి దోచుకున్నారే తప్ప గ్రామాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు
మహిళలకు వడ్డీ లేని రుణాలు
మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం
మహిళా సమైక్యలకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు
మన ఇంటికి ఉపయోగించే ఉచిత విద్యుత్తు
రైతు భరోసా రైతు రుణమాఫీ
హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు
రైతులకు రాయితీపై విత్తనాలు యాంత్రిక పనిముట్లు లాంటి అనేక పథకాలు చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలలో పూర్తిస్థాయి అభివృద్ధి కొనసాగుతుందని మీరు గెలిచి వస్తే నేను అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థులకు సూచించారు. విద్యాపరంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వైద్యపరంగా నూతన ఆసుపత్రుల నిర్మాణం అంతర్గత రోడ్ల నిర్మాణం విద్యుత్ సమస్యల పరిష్కారం తాగునీటి సమస్యల పరిష్కారం
గ్రామాలలో మౌలిక వసతుల కల్పన లాంటి అనేక పనులు చేపడుతున్నామన్నారు. గతంలో నుంచి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇతరులను నమ్మి మోసపోకూడదని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, వెంకట్రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి ప్రముఖ వైద్యులు పగిడాల శ్రీనివాస్, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మహిళలు కార్యకర్తలు యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story:కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం)

