రైతుల వ్యతిరేక నూతన విత్తన చట్టం బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద కేంద్ర ప్రభుత్వం నవంబర్ 11వ తేదీన ప్రవేశపెట్టిన నూతన విత్తనం చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం బిల్లు జిరాక్స్ కాపీలను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. నరేంద్ర మోడీ సర్కారు కార్పోరేట్ శక్తులకు వ్యవసాయాన్ని కట్టబెట్టడానికి ఈ నూతన విత్తన బిల్లును ప్రవేశపెట్టిందని, మోడీ సర్కారు వచ్చినప్పటి నుండి రైతులు వద్ద నుండి వ్యవసాయాన్ని లాక్కొని కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని, ఇందులో భాగంగానే వ్యవసాయం మూడున్నర చట్టాల్ని 2020లో తీసుకొచ్చిందని, దానిపై ప్రపంచ వ్యాప్తంగా అనూహమైన స్పందన రావడంతో రైతుల యొక్క పట్టుదల చూసి ఈ ఉద్యమం ఏ స్థాయికి పోతుందో అని భయపడి నరేంద్ర మోడీ నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకున్నారు తప్ప, నరేంద్ర మోడీ మనసులో ఎప్పటికీ వ్యవసాయాన్ని కార్పోరేట్ శక్తులకి కట్టపెట్టాలని ఆలోచన మారలేదని, ఇకనైనా మార్చుకోకపోతే రైతు ఉద్యమానికి నరేంద్ర మోడీ సర్కారు కొట్టుకుపోతుందని ఈ సందర్భంగా రాము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కాకర్ల కొండలు, ముట్లూరు బాలస్వామి, శివారెడ్డి, పెద్దారావు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరావు, ఏడుకొండలు, సుబ్బారావు అనేక మంది రైతు నాయకులు పాల్గొన్నారు. అనంతరం శివయ్య స్తూపం సెంటర్ లో బిల్లు కాపీలను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జునరావు, శివ, కరిముల్లా, సైదావలి, సుబ్బారావు, తదితర నాయకులు పాల్గొన్నారు.(Story : రైతుల వ్యతిరేక నూతన విత్తన చట్టం బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి )

