Home వార్తలు తెలంగాణ సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కాపాడింది కెసిఆర్

సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కాపాడింది కెసిఆర్

0

సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కాపాడింది కెసిఆర్

న్యూస్ తెలుగు/వనపర్తి : గణపురం మండలంలోని సురాయిపల్లి,ఉప్పరపల్లి,సోలీపూర్, అప్పారెడ్డి పల్లె,సల్కలాపూర్ గ్రామాల సర్పంచి అభ్యర్థులు కమలమ్మ,బాలరాజు,పద్మశ్రీ,,వీరయ్య,గిరమ్మ తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల లాగా బోగస్ మాటలు ఇచ్చి దాట వేసే మనిషిని కాదని మాట ఇస్తే మడమ తిప్పను అని చెప్పింది చేసి చూపిస్తానని బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే రాబోవు సర్కారులో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.సంక్షోభంలో ఉన్న రైతాంగాన్నీ రాజులను చేసిన ఘనత కె.సి.ఆర్ గారిది అని కొనియాడారు. 24గంటల కరెంట్,సాగు తాగు నీళ్లు,సకాలం పెట్టుబడి సాయం,కొరత లేకుండా యూరియా సరఫరా,సకాలములో ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని కాపాడింది బి.ఆర్.ఎస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు పూర్తి అయిన ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరగలేదని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. 420హామీలు,ఆరు గ్యారంటీలు అమలు చేయలేని కాంగ్రెస్ నాయకులకు పాలించే హక్కు లేదని మండిపడ్డారు. బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితే ఇచ్చిన హామీలు అమలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమములో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కాపాడింది కెసిఆర్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version