నియోజకవర్గం – పెదకంచెర్ల గ్రామ ప్రజల వినతి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం పరిధిలోని పెదకంచెర్ల గ్రామ చెరువు మీద జరుగుతున్న ఆక్రమణలను తొలగించి, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామస్తుల ఆందోళనలను సమగ్రంగా విన్న కలెక్టర్ , ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సర్వేలో భాగంగా చెరువు ఆక్రమణలను వెంటనే పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా ఏకమై ముందుకు రావడాన్ని అభినందించారు.
గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం..
వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి గత కొన్ని సంవత్సరాలుగా చెరువు భూభాగాన్ని ఆక్రమించి, గ్రామానికి చెందాల్సిన ప్రయోజనాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల గ్రామ అభివృద్ధి ఆగిపోయి, ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి అవసరమైన నీటిసౌకర్యాలు మరియు అభివృద్ధి పునరుద్ధరించాలంటే చెరువుపై ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని కోరిన గ్రామ పెద్దలు, ప్రజల తరఫున కలెక్టర్ ని వేడుకున్నారు. గ్రామ అభివృద్ధిని కాపాడేందుకు జిల్లా పరిపాలన నుంచి త్వరితగతిన చర్యలు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.(Story : నియోజకవర్గం – పెదకంచెర్ల గ్రామ ప్రజల వినతి )

