Home వార్తలు తెలంగాణ శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం

శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం

0

శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం

జిల్లా ఎస్పీ సునిత రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : శనివారం హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం సమావేశం భవనంలో వనపర్తి జిల్లా ఎస్పీమతి సునిత రెడ్డి, ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా హోంగార్డులు జిల్లా ఎస్పీ గారికి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. వనపర్తి జిల్లాలో 137 మంది హోం గార్డులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ పోలీసుశాఖకు బలమైన అండగా నిలుస్తున్నారు. ప్రజల రక్షణ, అంతర్గత భద్రతలో పోలీసుశాఖకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో 1946 డిసెంబర్ 6న స్వచ్ఛంద ఏర్పాటైనదే హోంగార్డ్ వ్యవస్థని అత్యవసర పరిస్థితుల్లో, శాంతిభద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో పోలీసుశాఖ చేస్తున్న కృషికి అదనపు బలం అందించేందుకు స్వచ్ఛంద సేవాభావంతో పనిచేసే, శిక్షణ పొందిన సిబ్బందే హోంగార్డ్స్ అని, హోంగార్డ్స్ కూడా పోలీసువ్యవస్థలో భాగమని, వారిసంక్షేమానికి పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు.హోంగార్డ్స్ సిబ్బంది రోజువారీ వేతనాన్ని ₹921 నుండి ₹1000కి పెంచడం, పరేడ్ అలవెన్స్‌ను ₹100 నుండి ₹200కు పెంచడం జరిగింది. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సహకారంతో ₹33 లక్షల హెల్త్ కవరేజ్ అందించబడుతోంది. పోలీసు సిబ్బందితో సమానంగా రైన్ కోట్, ఉలెన్ జాకెట్ వంటి అవసరమైన సామగ్రి అందించబడం జరుగుతుంది. యాక్సిడెంటల్ భీమా ప్రయోజనాలు అందిస్తూ. అసాధారణ మరణం పొందిన హోంగార్డ్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ ₹5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయబడం జరుగుతుంద అన్నారు. పోలీసు సాలరీ ప్యాకేజ్‌లో భాగంగా యాక్సిడెంటల్ డెత్‌కు ₹30 లక్షలు, ఇద్దరు పిల్లల చదువుకోసం ఒక్కొక్కరికి ₹2 లక్షలు ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ మెడికల్ సర్వీసుల కోసం ప్రతిపాదన పరిశీలనలో ఉందని అన్నారు. అర్హత కలిగిన హోంగార్డ్ సిబ్బందికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల మంజూరుపై పరిశీలన కొనసాగుతోందని, త్వరలో కొత్త హోంగార్డ్స్ నియామకాలు చేపట్టడానికి సన్నహకాలు జరుగుతున్నాయని అన్నారు.పోలీసు కానిస్టేబుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా, మీకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని, విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ సిబ్బందిని రివార్డ్స్ ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, క్రైమ్‌ నివారణ, కమ్యూని టీ పోలీసింగ్‌, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తు అత్యవసర పరిస్థితుల్లో హోమ్ గార్డులు చూపే అంకితభావం ప్రశంసనీయం అన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసపత్రాలు అందజేశారు.ఈ యొక్క కార్యక్రమం హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి, బాలాజీ నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, వినోద్ మరియు హోంగార్డు సిబ్బంది పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story:శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version