పానుగంటి చెన్నయ్య సేవాతత్పరుడు
న్యూస్‌తెలుగు/వనపర్తి : పోలీస్ అధికారి పానుగంటి.చెన్నయ్య(బుద్ధారం)అంబేద్కర్ విజ్ఞాన సేవా సంస్థ ఆధ్వర్యంలోజరిగిన సంస్మరణ సభలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఒక కుగ్రామం బుద్దారం దళిత కుటుంబములో పుట్టి పోలీస్ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి సేవా గుణం అలవర్చుకొని సమాజములో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న చెన్నయ్య ధన్యజీవి అని కొనియాడారు. పోలీస్ కానిస్టేబుల్ హక్కులకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోలీస్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి సంస్కరణలు సాధించారని అదేవిధంగా గ్రామములో యువజన సంఘాలు ఏర్పాటు చేసి యువతలో చైతన్యం తెచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడినారని అన్నారు.
సమాజానికి చెన్నయ్య స్పూర్తి అని అన్నారు. (Story:పానుగంటి చెన్నయ్య సేవాతత్పరుడు)

