అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం
ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతికి అంబేద్కర్ గారు చేసిన కృషి ఎనలేనిదనిఅంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి ఆదిత్య, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం)

