రాజ్యాంగం వల్లే సమాజంలో మౌలిక మార్పులు: సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాజ్యాంగం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు అవకాశాల వల్లే దేశంలోని పేద ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు వస్తున్నాయని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ అన్నారు. వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ 69వ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసమానతలు,అస్పూర్శత కుల మతాల తారతమ్యం లేని సమాజం అంబేద్కర్ ఆశయం. ఆ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.రాజ్యాంగం అన్ని వర్గాలకు సమానం గా అవకాశాలు,హక్కులు కల్పించారన్నారు.హక్కులు అవకాశాలను ప్రజలు ఉపయోగించుకొని ఎదగాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కళావతమ్మ,శ్రీరామ్,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమన్న, సిపిఐ పట్టణ సహయ కార్యదర్శి గోపాలకృష్ణ,సురేష్, భారత జాతీయ మహిళా సమాఖ్య వనపర్తి పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్ శిరీష,శ్రీదేవి,జ్యోతి,సుప్రియ, కాంతమ్మ, పానగల్ మండల కార్యదర్శి డంగు కురుమయ్య,మాజీ సహాయ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story:రాజ్యాంగం వల్లే సమాజంలో మౌలిక మార్పులు: సిపిఐ)

