డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ గోపాల్‌పేటమండలం పోల్కేపాడు గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ డు దశాబ్దాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పేదల బతుకులు లో ఆశలు నింపుతున్నాయని, వారికి రిజర్వేషన్ల పరంగా కూడు గూడు గుడ్డ దొరుకుతుందని చెప్తూ, అలాగే రాజ్యాంగంలోని లోసుగులను ఉపయోగించుకుని అక్రమార్కులు చేస్తున్న అవినీతిని ఎండగడుతూ వారు సమాజం కోసం చేసిన మంచి పనికై ఈరోజు పోలికేపాడు వచ్చి బంగారయ్య గెలుపుకు పనిచేస్తున్నామని, 40 సంవత్సరాలుగా ఒక గ్రామంలో పట్టిపీడిస్తున్న శని ని వదిలించాలని ప్రజలకు పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీ.ఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ మైబూస్ గారు, వెంకటేశ్వర్లు, పోల్కేపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బంగారయ్య, కురుమయ్య, రామస్వామి, నాగరాజు, రమేష్ ఎమ్మార్పీఎస్ నాయకులు, యాదవ సంఘం నాయకులు, పోలికేపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.(Story:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి)

