ఎండిఓ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
న్యూస్ తెలుగు /బొల్లాపల్లి : స్థానిక ఎండిఓ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కంశ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీ. కోట నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత కాక దళిత పేద ప్రజలకు ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు సాధించి సమాజంలో గౌరవ ప్రదమైన స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన స్మరించుకోవడం అంటే ఆయన చూపిన మార్గంలో కుల నిర్మూల కోసం కృషి చేయడమే అని ఆయన అన్నారు. స్థానిక ఎస్ఐ సమీర్ బాషా మాట్లాడుతూ. పేదలకు ఓటు హక్కు కల్పించిన మహా నేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారి రామకోటయ్య, ఎంపీడీవో మాధురి, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్, రాంబాబు నాయక్, బి సునీల్ ,జి. సునీల్ ఎం అంజి నాయక్, ప్రసంగించడం జరిగింది. అలాగే కార్యక్రమంలో రవి నాయక్, రామకృష్ణ నాయక్, వి. బర్మా నాయక్ తదితరులు పాల్గొన్నారు.(Story:ఎండిఓ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి…)
