మావోయిస్టుల కార్యకలాపాలకు వ్యతిరేకత తెలుపుతూ విద్యార్థుల సంఘాల గ్రామ ప్రజలు ధర్నా
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు గ్రామంలోని ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఈ రోజు ఒక సంయుక్త ధర్నాను నిర్వహించి, ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు, బంద్ ప్రకటనల వల్ల కలిగే బాధలను వ్యతిరేకించారు. “మావోయిస్టులు మాకు వద్దు” అనే నినాదం మధ్య జరిగిన ఈ నిరసనలో, స్థానికులు తమ ఆగ్రహాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. ప్రజలు, విద్యార్థి నేతలు తమ విజ్ఞప్తిలో, “మావోయిస్టులు తమ స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాల కోసం,మా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధికి అడ్డంగా ఉంచా రన్నారు . మావోయిస్టులు తరచూ ఏదో ఒక కారణం చూపిస్తూ బంద్ ప్రకటిస్తూ, ప్రజా రవాణాను పూర్తిగా స్తంభింప చేస్తున్నారని. దీనివల్ల సామాన్య జనులు, విద్యార్థులు, రోజువారీ కార్మికులు భయంతో, బాధతో జీవిస్తున్నారన్నారు. పాఠశాలు, వైద్యం, రోజుగారీ అవసరాల కోసం కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, “మావోయిస్టు కార్యకలాపాలకు బహిరంగ మద్దతు ఇవ్వడం, ఇటీవలి ఎన్కౌంటర్ స్థలానికి విచారణకు వెళ్లడం వంటి చర్యలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అందుకే, ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్తున్న ఓయుస్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం) విద్యార్థులను, మేము – స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాలు – అడ్డుకున్నామని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఏజెన్సీప్రాంత శాంతి భద్రతలకు, అభివృద్ధి ప్రక్రియకు భంగం కలిగిస్తాయి” అని తెలిపారు.
ఈ సందర్భంగా, మావోయిస్టు పార్టీ దిష్టి బొమ్మను తగలబెట్టి, వారి కార్యకలాపాల పట్ల తీవ్ర నిరసనను ప్రదర్శించారు. ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ దళాన్ని కోరారు, మావోయిస్టుల కార్యకలాపాలను నిర్ణయాత్మకంగా అరికట్టాలని, తద్వారా ప్రాంత ప్రజలు భయముకు లేకుండా, అభివృద్ధి మార్గంలో సురక్షితంగా నడవగలరని.
చింతూరు గ్రామ ప్రజలు, ఈ ప్రాంతం శాంతియుతంగా, ప్రగతిశీలంగా ఉండాలని తమ కోరికను పునరుద్ఘాటించారు. ఈ ధర్నాకు స్థానిక గ్రామస్తులు, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు, సామాజిక సంస్థలు పాల్గొన్నారు. (Story:మావోయిస్టుల కార్యకలాపాలకు వ్యతిరేకత తెలుపుతూ విద్యార్థుల సంఘాల గ్రామ ప్రజలు ధర్నా)

