Homeవార్తలు‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ రిలీజ్!

‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ రిలీజ్!

‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ రిలీజ్!

 పోస్టర్ చూసి షాకైన అభిమానులు!

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : ‘ఆర్‌ఎక్స్‌ 100’ ‘మంగళవారం’ వంటి సినిమాలతో యూత్ ఆడియ‌న్స్‌కు హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారిన‌ పాయల్‌ రాజ్‌పుత్ ఈ సారి ‘వెంకటలచ్చిమి’ గెట‌ప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పాయల్‌ రాజ్‌పుత్ జన్మదినం సందర్భంగా డైరెక్ట‌ర్ ముని తెర‌కెక్కిస్తున్న ఆమె అప్ కమింగ్ మూవీ ‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌ చూస్తేనే సినిమా ఎంత ఇంటెన్స్‌గా, ఎంత థ్రిల్లింగ్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది.

రాజా,పవన్ బండ్రేడ్డి నిర్మిస్తున్న‌ ‘వెంకటలచ్చిమి’ మూవీ బర్త్ డే పోస్టర్ లో హీరోయిన్‌ను ఒక  జైలు గదిలో పైకప్పుకు తలక్రిందులుగా వ్రేలాడితీసి చేతికి సంకెళ్లు, మేడలో మంగళసూత్రం ఉంచినట్టు కనిపిస్తుంది. రక్తపు మరకలు, మద్యన భయానక వాతావరణం.. అన్ని కలిసి పోస్టర్‌కి ప‌వ‌ర్‌ఫుల్‌ టచ్‌ను ఇస్తున్నాయి. ఆమె చేతులుకి సంకెళ్లు ఉండటం, రక్తంతో కూడిన మంగళసూత్రం, చుట్టూ నిశ్శబ్ద భయానికి సూచనగా ఉన్న నేపథ్యం సినిమాపై ఉత్కంఠ‌ను పెంచుతూ, సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతున్నాయి. పోస్టర్‌పై “First Look & Glimpse Coming Soon” అని ప్రకటించడం ద్వారా త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ రానున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

బర్త్ డే పోస్టర్ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ పాయల్ రాజ్‌పుత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు ముని పేర్కొన్నారు. ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా తర్వాత తనను ప్రేక్షకులు వెంకటలచ్చిమి అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన భావోద్వేగాలుంటాయని పాయల్‌ రాజ్‌పుత్‌ చెప్పింది. పాన్‌ ఇండియా స్థాయిలో 6 భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహిస్తున్నారు. రాజా, పవన్ బండ్రేడ్డి లు నిర్మాతలు.

బ్యాన‌ర్:  సినిమా టికెట్ ఎంట‌ర్‌టైన్మెంట్
నిర్మాత‌లు: రాజా, పవన్ బండ్రేడ్డి.
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముని
డిఓపి : రాహుల్ మాచినేని
సంగీతం: వికాస్‌ బడిశా
ఎడిటర్ : మార్తాండ్ వెంకటేష్,
పీఆర్‌ఓ: క‌డ‌లి రాంబాబు, ద‌య్యాల అశోక్.(Story:‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ రిలీజ్!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!